మెట్రో సిటీలైన ముంబాయి ఢిల్లీ కలకత్తా చెన్నై లాంటి ప్రముఖ నగరాలలో ‘A’ సర్టిఫికేట్ సినిమాలను టీన్ ఏజర్స్ చూసే విషయంలో చాలగట్టి ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొనుక్కుని ధియేటర్లకు వచ్చినా 18 సంవత్సరాల లోపు ఉన్న టీన్ ఏజర్స్ ను ధియేటర్లలోకి అనుమతించకుండా వారు చూపించే టిక్కెట్లతో పాటు ఆధా’ర్ కార్డు జరాక్స్ లను కూడ అడిగే పద్ధతి ఉత్తరాది ప్రాంతానికి చెందిన ప్రముఖ నగరాలలోని మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో చాల కఠినంగా కొనసాగుతోంది. 

దీనితో ‘A’ సర్టిఫికేట్ సినిమాలు చూడడానికి అక్కడి టీన్ ఏజర్స్ చాల ఇబ్బంది పడుతున్నారు. అయితే ‘కబీర్ సింగ్’ మ్యానియా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న నేపధ్యంలో ఈసినిమాను ఎలాగైన చూడాలి అన్న ఉద్దేశ్యంతో చాలామంది టీన్ ఏజర్స్ తమ ఆధార్ కార్డ్ లలోని పుట్టిన తేదీని మార్చుకుని ఫేక్ ఆధార్ జరాక్స్ లతో ‘కబీర్ సింగ్’ మూవీని చూస్తున్న టీన్ ఏజర్స్ మ్యానియా పై ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈమ్యానియా పై ఒక మల్టీ ప్లెక్స్ చైన్ అధినేత ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ తమ ధియేటర్లకు వస్తున్న టీన్ ఏజర్స్ తమ టిక్కెట్లతో తీసుకు వస్తున్న ఆధార్ జరాక్స్ కాపీలు కట్టలుకట్టలుగా వస్తున్నాయని చెపుతూ ఈసినిమాను చూస్తున్న చాలామంది మైనర్స్ అని తెలిసినా కూడ ఏమి చేయలేకపోతున్నామని చెప్పిన షాకింగ్ విషయాన్ని కూడ ఆ పత్రిక ప్రముఖంగా ప్రచరించింది. ఇదేపత్రిక ప్రస్తుతం ఈమూవీ పై టీన్ ఏజర్స్ లో ఏర్పడ్డ మ్యానియా పై ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అనామిక చెప్పిన అభిప్రాయాన్ని కూడ ఆపత్రిక చాల ప్రముఖంగా ప్రచురించింది. 

ఈసినిమాను చూసిన అనేకమంది టీన్ ఏజర్స్ వ్యక్త పరుస్తున్న అభిప్రాయం ప్రకారం ‘కబీర్ సింగ్’ సినిమాను చూస్తుంటే తమ మైండ్ బ్లాంక్ అయిపోయి తాము ఎక్కడ ఉన్నామో తెలియని విచిత్ర పరిస్తుతులలోకి తాము వెళ్ళిపోతున్నామని ఈసినిమా తమకు విపరీతంగా నచ్చింది అంటూ కామెంట్స్ చేసినట్లు డాక్టర్ అనామిక చెప్పిన అభిప్రాయాన్ని చాల ప్రముఖంగా ఆ పత్రిక ప్రచురించింది. అయితే డాక్టర్. అనామిక ఈసినిమా పై చెపుతున్న అభిప్రాయం ప్రకారం పరిపక్వత లేని టీన్ ఏజర్స్ మైండ్ ను ఈమూవీ ‘డ్రగ్స్’ కన్నా భయంకంరంగా చెడగొడుతుంది ఆమె అభిప్రాయపడుతున్నా ఇప్పటికే 150 కోట్ల కలక్షన్స్ దాటి ముందుకు దూసుకుపోతున్న ‘కబీర్ సింగ్’ ఈవారంతానికి 200 కోట్ల మార్క్ ను దాటిపోవడం ఖాయం అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: