రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా తెరకు పరిచయమవుతున్న మేఘంష్ మొదటి సినిమా రాజ్ దూత్ ఎల్లుండి విడుదల కావడం లేదట. ట్రైలర్ తో పాటు పోస్టర్స్ లో రిలీజ్ డేట్ జులై 5గా పేర్కొంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడది సాధ్యపడేలా లేదు. సెన్సార్ సకాలంలో పూర్తి కాకపోవడంతో పాటు తగినన్ని స్క్రీన్లు దొరికే చాన్సు లేకపోవడంతో మరోవారం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.

 

అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇంకొద్ది గంటల్లో వెలువడవచ్చు. ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్ పెట్టకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ నిజమే అయితే ఇది మంచి నిర్ణయమే అనుకోవాలి. జులై 5న బజ్ మొత్తం సమంతా ఓ బేబీ మీదే ఉంది. సురేష్ సంస్థ కాబట్టి గ్రాండ్ రిలీజ్ దక్కుతోంది. మరోవైపు బుర్రకథను సైతం బాగానే మార్కెట్ చేస్తున్నారు.

 

అటు చూస్తే మల్టీ ప్లెక్సులలో స్పైడర్ మ్యాన్ హంగామా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ దూత్ వాయిదా సరైనదే అని చెప్పాలి. మేఘంష్ మీద కానీ సినిమా గురించి కానీ ప్రేక్షకులకు ఇంకా అవగాహన రానే లేదు. ప్రమోషన్ కాస్త ఉదృతంగా చేసి ఆపై వదిలితే ఓపెనింగ్స్ ని ఆశించే అవకాశం ఉంటుంది. కేవలం శ్రీహరి ఫ్యాన్స్ తో హాల్స్ నింపడం కష్టం.

 

దానికి తోడు సెన్సార్ తతంగం కొంత ఆలస్యం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ ఫోన్ చేసినట్టుగా చెబుతున్నారు. దీని మీద శ్రీహరి భార్య శాంతి చాలా ఆశలు పెట్టుకున్నారు. డెబ్యూ మూవీ కావడంతో ఇది హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.ఈ లెక్కన జులై 12కి షిఫ్ట్ అవ్వడం ఒకటే రాజ్ దూత్ ముందున్న ఛాయస్..అని క్రిటిక్స్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: