తెరమీద ఎంతో గంభీరంగా కనిపించే ఎస్వీ రంగారావు నిజ జీవితంలో మాత్రం ఎంతో సున్నిత హృదయంతో ఉండేవారు. రామం దొరికినా బొమ్మలు వేయడం, కవితలు రాయడం, పుస్తకాలు చదవడం వంటి పనులు చేసేవారు. అయితే ఒకసారి ఎస్వీఆర్ వేటకు వెళ్లి నప్పడు ఒక జింక పిల్ల ఆయనకు కనిపించింది. అయితే అది ఆయన్ని చూసి పారిపోవడానికి ఏ మాత్రం ప్రయత్నించకుండా ఎస్వీఆర్ వైపు చూస్తూ ఉండి పోయిందట. బహుషా ఈ చిన్న ప్రాణాన్ని ఎలా చంపాలని చూస్తున్నావని దాని ఉద్దేశమా అన్న భావన ఎస్వీఆర్ కి కలిగిందట. అంతే అప్పటి నుంచి ఆయన ఏనాడూ వేటకు వెళ్లలేదట. 


ఇండస్ట్రీలో ఎస్వీఆర్ ఎంతో గంభీరమైన వ్యక్తో ఆయన హావభావాలు..మాట తీరు బట్టే చెప్పేవారట.  సీన్ నచ్చకపోతే ఎంతటి దర్శకులైన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించేవారట. అందుకే ఆయనను కొంత మంది ఎస్వీఆర్ ను ఆహంభావిగా చెబుతుంటారు. ఆలాంటి ఒక సంఘటన ‘హరిశ్చంద్ర’ షూటింగ్ సమయంలో జరిగింది. 1956 లో విడుదలైన 'హరిశ్చంద్ర' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న రోజులు... ఈ చిత్రంలో ఎస్వీఆర్ హరిశ్చంద్రుడు కాగా  విశ్వామిత్రుడుగా గుమ్మడి నటిస్తున్నారు.

ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడిని హరిశ్చంద్రుడు క్షమించమని ఆయన కాళ్లపై పడితే..కాలితో ఆయన కిరీటాన్ని తన్నడం..కిరీటం పక్కనపడిపోవాలి, కానీ  ఇలాంటి సన్నివేశంలో నటించడానికి ఎస్వీఆర్ ఒప్పుకోలేదు. గుమ్మడి తన తలని తన్నడమేంటి? అన్నట్టుగా దర్శకుడిని ఎగాదిగా చూసి అక్కడ నుంచి ఎంతో ఆవేశంగా వెళ్లిపోయారట..అంతే అక్కడే ఉన్న చిత్ర యూనిట్ ముక్కున వేలేసుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: