ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమా ప్రమోషన్స్ షురూ అయ్యింది.  ఈ రోజు ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ సింగిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  సైకో సయాన్ అనే పేరుతో సాగే సాంగ్ కు సంబంధించిన పోస్టర్ అది.  ప్రభాస్ హ్యాండ్ సమ్ గా ఉన్నాడు.  లుక్స్ ఆకట్టుకున్నాయి.  


చూస్తుంటే ఇది డ్యూయెట్ లా ఉన్నది.  పైగా ఎలక్ట్రిఫైగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతున్నది.  ఈ పోస్టర్ తరువాత అంచనాలు పెరిగాయి.  అయితే, ఇందులో ఈ సింగ్ మ్యూజిక్ ఎవరు, లిరిక్ రైటర్ ఎవరు అనే విషయాలను మెన్షన్ చేయలేదు.  


ఎందుకు మెన్షన్ చేయలేదు అనే విషయాన్నీ పక్కన పెడితే.. ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అవే బయటకు వస్తుంటాయి.  ఫస్ట్ సింగిల్ పోస్టర్ ను  రిలీజ్ చేశారు,  అయితే, ఈ సింగిల్   ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్నీ మాత్రం బయటపెట్టలేదు.  


ఇప్పుడు అందరిలోనూ దీనిగురించి చర్చ జరుగుతున్నది. పోస్టర్ రిలీజ్ చేసి వదిలేస్తే ఎలా.. ప్లేట్ లో అన్ని వడ్డించి తినొద్దు అనిచెప్పినట్టు .. అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసి.. సింగిల్ ఎప్పుడు ఉంటుందో చెప్పకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.  ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: