టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అటు సినిమాల‌తో పాటు ఇటు బుల్లితెర మీద బిగ్‌బాస్‌-3 హోస్ట్‌గా కూడా విజృంభించేందుకు రెడీ అవుతున్నాడు. నాగ్ ప్ర‌స్తుతం రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2002లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ సినిమా మ‌న్మథుడికి సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బంగార్రాజు కూడా చేస్తున్నాడు.


2015 సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాలో బంగార్రాజు పాత్ర‌నే టైటిల్‌గా పెట్టుకున్న ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ కుర‌సాల దర్శకుడు. ఈ సినిమా నాగార్జున స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవ్వ‌రూ ఊహించ‌ని అమ్మాయిని తీసుకోబోతున్నార‌ట‌. ముందుగా ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ హీరోయిన్  అని వార్తలు వచ్చాయి. 


ఇప్పుడు కాజ‌ల్ క‌న్నా చిత్ర‌యూనిట్ పూజాహెగ్డేపై ఇంట్ర‌స్ట్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ కాజ‌ల్‌ను ప‌క్క‌న పెట్టేసి పూజాతో కాంటాక్ట్ అయ్యింద‌ట‌. పూజా త‌న తొలి తెలుగు సినిమాలోనే నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌తో ఒక‌లైలాకోసం సినిమాలో రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. 


నాడు కొడుకుతో రొమాన్స్ చేసి యావ‌రేజ్ సినిమా ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉంది. ఈ టైంలో మ‌న్మ‌థుడు నాగార్జున‌తో ఆడిపాడి ఎలాంటి హిట్ ఇస్తుందో ?  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: