టాలీవుడ్లో ద‌ర్శ‌కులు సినిమాలు తీస్తుంటే వాటిల్లో వేలుపెట్టి ఇష్ట‌మొచ్చిన‌ట్టు కెలికేసే హీరోలు చాలా మందే ఉన్నారు. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య‌, మ‌హేష్‌బాబు లాంటి వాళ్లు మాత్ర‌మే ఒక‌సారి క‌థ విన్నాక ద‌ర్శ‌కుడిని ఎలాంటి ఇబ్బంది పెట్ట‌ర‌న్న అభిప్రాయం ఇండ‌స్ట్రీలో ఉంది. ఇక ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా మెగా ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు చేయాలంటే చుక్క‌లే క‌న‌ప‌డ‌తాయ‌న్న రూమ‌ర్ ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుంచో ఉంది.


మెగా హీరోల‌తో సినిమాలు చేసిన చాలా మంది ద‌ర్శ‌కులు త‌మ బాధ‌ను పైకి చెప్పుకోక‌పోయినా త‌మ స‌న్నిహితుల వ‌ద్ద మెగా హీరోల కెలుకుడిపై వాపోయిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు చెపుతుంటారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 151 సైరా సినిమా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.


ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఫైన‌ల్ క‌ట్ రెడీ అవుతోన్న వేళ చిరంజీవితో పాటు మిగిలిన మెగా టీం అంతా ఎడిటింగ్ రూంలో కెలుకుడు స్టార్ట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు వీళ్లంతా క‌లిసి అలా చేయాలి.. ఇలా చేయాలంటూ అతి చేస్తుండ‌డం ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికి తీవ్ర‌మైన అస‌హ‌నం క‌లిగిస్తోన్న‌ట్టు టాక్‌.


కొన్ని సీన్లు షూట్ చేసేట‌ప్పుడు స్వ‌యంగా మెగాస్టార్ అలా చేస్తే బాగుంటుంది... ఇలా చేస్తే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు అవి కూడా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ముందుగా రాసుకున్న దాని ప్ర‌కారం మార్చాల్సి వ‌చ్చింద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: