‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు ఈ ట్రైలర్ పై కామెంట్స్ చేస్తూ ఈ మూవీ  సెన్సార్ వర్గాలకు చేతినిండా పనిపెట్టబోతొందా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. తెలుస్తున్న సమాచరం మేరకు  ఎడిటింగ్ స్టేజిలో ఉన్న ఈసినిమాను ఇప్పటికే చూసిన వారు ఈమూవీకి సంబంధించి   డైలాగ్స్ లోనే కాదు సన్నివేశాల్లో కూడా విచ్చలవిడిగా విశృంఖలత్వం పొంగిపొర్లింది అని కామెంట్స చేస్తున్నట్లు టాక్. 

దీనితో ఈసినిమాకు సెన్సార్ లో ఇక్కట్లు తప్పవని స్వయంగా ఆ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులు అంటున్నారు అంటూ వస్తున్న వార్తలను లీక్ చేస్తున్నారు.  దీనికితోడు ఇప్పటికే  రిలీజైన ట్రయిలర్ లో డైలాగ్స్ కూడా యాజ్ ఇటీజ్ గా థియేటర్ లో ఉండవు అందులో చూపించిన కొన్ని సీన్లు కూడా కట్ అవ్వడం గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి పూరి జగన్నాధ్ సినిమాల్లో బోల్డ్ సీన్లు కామన్ అవడమే కాకుండా  హీరోయిన్లతో కూడా పచ్చిగా బోల్డ్  డైలాగ్స్ చెప్పించే విషయం సర్వసాధారణమే అయినా ఈ సారి ఈ సీన్స్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో శ్రుతి మించాయి అన్న ప్రచారం జరుగుతోంది.  రొమాంటిక్ సీన్లుతో  పాటు  తెలంగాణ యాస డైలాగ్స్ లో డూడ ద్వందార్ధాలు వినిపించే విధంగా ఉన్న నేపధ్యంలో ఈసినిమా చాల చోట్ల సెన్సార్ కత్తెరకు గురౌతుంది అంటూ అంచనాలు వేస్తున్నారు. 

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చేవారం సెన్సార్ గుమ్మం  ఎక్కబోతున్న నేపధ్యంలో ఈ మూవీలోని చాలా సీన్స్ ఈ మధ్య విడుదల అయిన  ‘ఫలక్ నుమా దాస్’ ని పోలిన బూతు డైలాగులకు ఏమాత్రం తీసిపోదు అన్న ప్రచారంజరుగుతోంది.  దీనితో పూరి తనకు పేరు తెచ్చిపెట్టి యాక్షన్ సన్నివేశాల సీన్స్ ను వదిలి పెట్టి ఇలా చీప్ అడల్ట్ కంటెంట్ ను ఎందుకు ఎంచుకున్నాడు అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ  కధకు సంబంధించి బ్రెయిన్ లో చిప్ పెట్టడం అన్నపాయింట్ మీద తీయబడినా ఇలాంటి కథలు గతంలో చాల వచ్చాయి కథా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: