అక్కినేని కోడ‌లు సమంత జోరు పెళ్లి త‌ర్వాత కూడా త‌గ్గ‌డం లేదు. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో ఆమె న‌టించిన మ‌జిలీ త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. తాజాగా స‌మంత న‌టిస్తోన్న ఓ బేబీ రేపు రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమాపై ఫ్యామిలీ ఆడియోన్స్‌లో కాస్త క్రేజ్ ఉంది. 


పోటీ సినిమాలు కూడా లేక‌పోవ‌డంతో వారం రోజుల పాటు బేబీ బాక్సాఫీస్‌ను దున్నుకోవ‌చ్చు. అయితే సినిమాకు ముందుగా మంచి టాక్ రావాలి. ట్రైలర్లు, వీడియో ప్రోమోలు ఆసక్తి రేపడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను ఫైన‌ల్ ర‌న్ టైం బాగా టెన్ష‌న్ పెట్టేస్తుంద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


ఓ బేబీ ఫెన‌ల్ ర‌న్ టైం 2.40 గంట‌లు దాకా వ‌చ్చింద‌ట. అంటే 160 నిమిషాల పాటు థియేట‌ర్లో కూర్చొని సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి... అలా ఎంగేజ్ చేసేంత కంటెంట్ సినిమాలో ఉండాలి. రంగస్థలం, మహానటి సినిమాలు అంత ర‌న్ టైంలో కూడా హిట్ చేశారంటే అందులో ఉన్న కంటెంట్ గొప్ప‌త‌న‌మే. 


మ‌రి ఓ బేబీలో మాస్ విజిల్స్ వేసేంత ద‌మ్మున్న కంటెంట్ గాని.. అదిరిపోయే పాట‌లు గాని లేవు. మ‌రి స‌మంత క్యారెక్ట‌ర్ బేస్ చేసుకుని న‌డిచే ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎలా ఉంటుందో ?  రేపు తేలిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: