బిగ్‌బాస్ షో పుణ్యమా అని అప్పటి దాకా కాస్తోకూస్తో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లంతా తిరుగులేని ఇమేజ్ తెచ్చేసుకుంటున్నారు. దీనికి తోడు సోష‌ల్ మీడియా కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌ను హీరోలుగా చేస్తోంది. దీనికి తెలుగు బిగ్‌బాస్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ షోలో పాల్గొన్న వారిలో క‌త్తి మ‌హేష్ లాంటి వాళ్లు పెద్ద పాపుల‌ర్ అయిపోయారు. అప్పటి వరకూ సినిమాల్లో, టీవీల్లో వచ్చిన క్రేజ్‌కు, బిగ్‌బాస్‌తో తెచ్చుకున్న క్రేజ్‌కు తేడా ఎలా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


తమిళ బిగ్‌బాస్ 3 వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న శ్రీలంక న్యూస్ యాంకర్ లోస్లియా మరియానేసన్ ఇప్పుడు తమిళ కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోంది. ప్ర‌స్తుతం త‌మిళ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆమె గురించే హాట్‌హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. త‌మిళ యువ‌త అంతా ఇప్పుడు లోస్లియా అంద‌మైన ఫొటోల‌తో తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను నింపేస్తున్నారు. 


గ‌తంలో ఇదే తమిళ బిగ్‌బాస్ షో ద్వారా ఒవియాకు కూడా ఈ రేంజ్ క్రేజ్ వచ్చింది. ఆమె హాట్‌హాట్ అందాలు కూడా అప్ప‌ట్లో హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ 3 అభిమానుల ఫోకస్ లోస్లియాపై పడింది. లోస్లియా తన ప్రవర్తన, మాట తీరుతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: