2004 లో 'జై' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవదీప్.  ఇప్పటికి పదిహేనేళ్ళయింది. మొదట్లో సోలో హీరోగా కెరీర్ ఆశాజనకంగానే సాగింది కానీ తర్వాత స్లో అయ్యాడు.  అప్పటి నుంచి  ఇతర హీరోలతో కలిసి నటించడం.. క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న తర్వాత కొంత క్రేజ్ పెరగడంతో క్యారెక్టర్ అరిస్ట్ గా నాలుగైదు సినిమాల ఆఫర్లు వచ్చాయి. 

 

ఇదిలా ఉంటే నవదీప్ తాజాగా తన మేకోవర్ తో అందరికీ ఒక్కసారిగా సర్ ప్రైజ్ ఇచ్చాడు.  నవదీప్ మొదటి నుంచి ఫిట్నెస్ కాన్షియస్ పర్సనే కానీ బిగ్ బాస్ టైమ్ లో మాత్రం కాస్త వెయిట్ పెరిగాడు.  ఇప్పుడు నవదీప్ కొత్త లుక్ చూస్తే మాత్రం ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. నవదీప్ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫోటో సూపర్ ఫిట్ గా కండల వీరుడి తరహాలో కనిపించడం విశేషం. గ్రే కలర్ స్పోర్ట్స్ వేర్ ధరించి జిమ్ లో తీసుకున్న సెల్ఫీ.  హెయిర్ క్లిప్.. లైట్ గా గడ్డంతో బాలీవుడ్ స్టైల్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. 

 

నెటిజన్లు ఈ ఫోటోకు పొగడ్తల వర్షం కురిపించారు.  'టాలీవుడ్ సల్మాన్ ఖాన్' అని కూడా ఒకరు.. 'కెప్టెన్ అమెరికా' అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరి ఈ కండలు.. ఆ లుక్ చూస్తుంటే నవదీప్ టాలీవుడ్ లో విలన్ పాత్రలకు నేను రెడీ అన్నట్టుగా ఉంది.  సహజంగా మన ఫిలిం మేకర్స్ విలన్ అనగానే బాలీవుడ్ కండల వీరుల్ని తీసుకొస్తారు కదా.. ఇక్కడ మన పక్క లోకల్ బాయ్ ఉన్నప్పుడు వారితో పనేంటి చెప్పండి?

 

అలా అని నవదీప్ కు విలన్ రోల్స్ మాత్రమేనా.. అని మీరు కోప్పడాల్సిన పనిలేదు.  హీరో రోల్స్ వచ్చినా సంతోషమే.  మంచి నటుడు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోనే కదా.  ఈ సంగతేమో కానీ ప్రస్తుతం నవదీప్ తెలుగులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు.  తమిళంలో 'వీరమాదేవి'.. 'సీరు' చిత్రాలలో నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: