సాలీడు పురుగులను చూస్తే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. కానీ, సాలి పురుగు వేషంలో ఉన్న మనిషిని చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తూ వస్తున్న హాలీవుడ్‌ నటుడు టామ్‌ హోలాండ్‌ (స్పైడర్‌మ్యాన్‌)కి సాలీడులంటే భయమట.

 

ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘మీరు తెరపై చూసే స్పైడర్‌మ్యాన్‌ గోడలు ఎక్కి దూకుతూ ఉంటాడు. నిజమైన సాలి పురుగులు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తమని తాము కాపాడుకోవడానికి సాలెగూడును ఏర్పాటు చేసుకున్నట్లు తెరపై కనిపించే స్పైడర్‌మ్యాన్‌ కూడా తనకున్న శక్తులతో అందరినీ కాపాడుతుంటాడు.

 

ఈ సినిమా ద్వారా సాలి పురుగులంటే భయమున్నవారికి వాటిపై పాజిటివ్‌ అభిప్రాయాన్ని కల్పించగలిగాం. నిజం చెప్పాలంటే నాకు కూడా సాలీడులంటే ఇష్టం ఉండదు. అవంటే నాకు భయం. ఓసారి షూటింగ్‌లో మాకు నిజంగానే సాలీడు కనిపించింది.

 

దానిని పట్టుకుని ఫొటో దిగుతావా అని దర్శకుడు అడిగారు. నేను చచ్చినా దిగనని చెప్పాను’ అని తెలిపారు. భారతదేశంలో ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిగతా దేశాల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: