యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి  మేకింగ్ పరంగా కొంత ఓకే అనిపించుకుంది కానీ కంటెంట్ పరంగా ఫలితం ఆశించిన మేరకు రాకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. సరే ఓ ప్రయత్నమైతే జరిగిందని సర్దిచెప్పుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకొంత హోమ్ వర్క్ చేసి అవసరం లేని అంశాల మీద ఫోకస్ పెట్టి ఉంటే ఇదో మంచి థ్రిల్లర్ మూవీగా నిలిచేదన్న కామెంట్స్ లేకపోలేదు.

 

ఇదలా ఉంచితే ఇదే కల్కిని గతంలో బాలకృష్ణతో తీయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసినట్టుగా ఇంతకు ముందే టాక్ వచ్చింది. దానికా దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏ దశలోనూ కల్కికి హీరోగా బాలయ్యను అనుకోలేదని రాజశేఖర్ గారికి తనకు ఒకేసారి ఈ కథ నచ్చడం వల్ల ప్రాజెక్ట్ సెట్ అయ్యిందే తప్ప ఇంకో హీరో అయితే కథ  మార్చాల్సి వచ్చేదని క్లారిటీ ఇచ్చాడు.

 

ఇలా చెప్పడం పక్కన పెడితే ప్రశాంత్ వర్మ దగ్గర బాలకృష్ణకు సరిపడా అద్భుతమైన కథ ఒకటుందట. ఈ మధ్యే కల్కి ప్రమోషన్ కు వెళ్ళినప్పుడు ఓ ధియేటర్ వద్ద ఈ మాట చెప్పాడు. ఇప్పుడీ కల్కి గురించిన క్లారిటీ చూస్తుంటే తర్వాతైనా కార్యరూపం దాలిస్తే బాగుండు అనిపిస్తోంది. కానీ చాలా ఏళ్ళ క్రితం ఏదో పత్రికలో బాలయ్య హీరోగా కల్కి టైటిల్ తో ఓ సినిమా తీసే ప్లానింగ్ జరుగుతోందని చదివానని అంతకు మించి కల్కికి ఆయనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు ప్రశాంత్ వర్మ.

 

రెండు సినిమాల ప్రయాణం పూర్తి చేసుకున్న ప్రశాంత్ వర్మ మూడోది కూడా థ్రిల్లర్ జానర్ లోనే రూపొందిస్తాడట. చూడాలి మరి, దీన్ని బాలబాబుకి చెబుతాడా లేదా మరేదైనా ఫ్యాక్షన్ డ్రామా ఏమైనా ప్లాన్ చేస్తాడా కొన్ని రోజులు ఆగితే గాని మనకు తెలియదు.  కానీ ఈ లోపు ఎవరకు నచ్చిన కథ వారు రాసుకోవడం గ్యారంటీ..


మరింత సమాచారం తెలుసుకోండి: