సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నట్టుగానే ఆ అంచనాలను రీచ్ అయ్యినట్టు తెలుస్తోంది.  యుఎస్,యూకే వంటి దేశాల్లో ఇప్పటికే షోలు ముగిశాయి.  అక్కడి నుంచి అందుతున్న టాక్ ప్రకారం మూవీ రోలర్ కోస్టర్ లా ఉందని తెలుస్తోంది.  


సమంత రకరకాల వేరియేషన్స్ లో అద్భుతంగా నటించిందని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు.  సమంత నటన ఈ స్థాయిలో ఉంటుందని అసలు ఊహించలేదని.. వావ్ సూపర్ సమంత అని ట్వీట్ చేస్తున్నారు.  ప్రతి ఒక్కరికి మూవీ నచ్చుతుందని అంటున్నారు.  మూవీ కోసం సమంత చాలా కష్టపడిందని ఆ కష్టానికి ప్రతిఫలం సినిమాలో కనిపిస్తోందని అంటున్నారు.  


గ్రాండ్ మదర్, మదర్ తో కలిసి సినిమా చూడాలని, ముఖ్యంగా అమ్మమ్మలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొందరు ట్వీట్ చేస్తున్నారు.  కామెడీతో పాటు సమంత ఎమోషన్ సూపర్బ్ గా ఉందని అంటున్నారు.  క్లైమాక్స్ కంటతడి పెట్టించినట్టు ట్వీట్ చేస్తున్నారు.  రాక్ స్టార్ యాక్టింగ్ అని కొందరంటే.. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఈ మూవీ పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు.  


సినిమాకు మొదటినుంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  రిలీజ్ తరువాత అది మరింతగా పెరిగింది.  యూఎస్ లో పాజిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం ఇక్కడ పడే అవకాశం ఉంది.  ఇక్కడ కలెక్షన్లు భారీగా ఉండే అవకాశం ఉన్నది.  పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో మూవీకి ప్లస్ కావొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: