‘ఓ బేబి’ ప్రీమియర్ షోల హంగామా అమెరికాలో చాల భారీస్థాయిలో జరిగింది. ఒక టాప్ హీరో సినిమాలకు సమానంగా సరితూగే విధంగా ఈమూవీని ఓవర్సీస్ లో చాలఎక్కువ ధియేటర్లలో విడుదల చేసారు. ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు చివరిలో ఈసినిమాను చూసి ‘వావ్ బేబి’ అంటూ తమ సీట్లలోంచి లేస్తున్నారు అంటూ తొలి ఓవర్సీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సమంత అద్భుతమైన నటనా విశ్వరూపానికి రాజేంద్రప్రసాద్ నాగశౌర్య లక్ష్మిల సపోర్ట్ తో ఈమూవీ మరొక స్థాయికి వెళ్ళిపోయింది అంటూ ఈమూవీ చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.  

ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే హాస్పటల్ ఎమోషనల్ సీన్స్ లోని ఉద్యోగానికి ఓవర్సీస్ ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి ప్రతిభ ఈమూవీలోని ప్రతి సీన్ లో కనిపిస్తే ముఖ్యంగా సమంత కనపరిచిన నటనతో పాటు ఆమె చూపించిన అద్భుతమైన మ్యానరిజమ్స్ ను చూసిన వారికి ‘ఓ బేబి’ ‘వావ్ బేబి’ అని అనిపిస్తుందని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. ‘నాలో మైమరుపు’ పాటలోని మెలోడి ‘ఆకాశంలోన’ పాటల చిత్రీకరణ అద్భుతం అని అంటున్నారు.  

ముఖ్యంగా ఈమూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో అడవి శేషు పాత్ర కూడ బాగా కనెక్ట్ అవుతుంది. ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ముగిసే సమయానికే ప్రేక్షకులు ఈమూవీ అద్భుతం అన్న అభిప్రాయానికి వస్తారని ముఖ్యంగా బేబి పాత్రలో నటిస్తున్న సమంత తన ఇంటికి తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు తన నటనలో చూపిన భావోద్వేగంతో పాటు సమంత తన నటనలో చూపించిన ఫన్నీ యాంగిల్ కూడ ఈమూవీకి హైలెట్ గా మారుతుంది అని ఓవర్సీస్ ప్రేక్షకుల భావన. ‘చాంగ్ బలా’ అన్నపాట సింపుల్ లిరిక్ గా వినిపించినా ఈమూవీలో మాత్రం చాలచక్కగా చిత్రీకరించ బడింది. 

ముఖ్యంగా ఈమూవీలో బామ్మ పాత్రలో కనిపించిన లక్ష్మి సమంతగా మారే సీన్ ను ఏమాత్రం అతిశయోక్తి అనిపించకుండా చాల జాగ్రత్తగా డీల్ చేసి నందినీ రెడ్డి ఆసీన్ ను మెప్పించింది అని అంటున్నారు. ముఖ్యంగా చాల గ్యాప్ తరువాత తెలుగు సినిమాలలో కనిపించిన లక్ష్మి నటన చూసిన వారికి ఈమె మళ్ళీ తెలుగు సినిమాలలో బిజీ అవ్వడం ఖాయం అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇలా ‘ఓ బేబి’ లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ ఈసినిమాను చూసినవారు వావ్ అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: