పవన్ కల్యాణ్ సినిమాలు చేయట్లేదనేది తెలిసిన విషయమే. ఫుల్ టైమ్ పోలిటీషియన్ గా మారిపోయాడు. గ్లామర్ రంగంలో లేకపోతే ఫిజిక్ మెయింటెయిన్ చేయడం కష్టమే. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ డిఫరెంట్. మొన్నటివరకు గుబురు గెడ్డంతో ఉన్న పవన్ రీసెంట్ లుక్ లో షాక్ ఇచ్చాడు. అమెరికాలో తానా మహాసభల్లో పాల్గొనడానికి వెళ్లిన పవన్ ను వాషింగ్టన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలో పవన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక తన బాడీ మీద కంట్రోల్ కోల్పోయాడు. సినిమాల చిరంజీవిలో ఉన్న మ్యాజిక్ రాజకీయ చిరంజీవిలో లేదు. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నాక తన పాత లుక్ తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ భిన్నంగా ఉన్నాడు. పాలిటిక్స్ లో ఉన్నా తన లుక్, తన బాడీ షేప్ ను మారకుండా చూసుకుంటున్నట్టున్నాడు. ఎయిర్ పోర్టులో తన లగేజ్ తో ఫుల్ టీషర్ట్, జీన్స్, షూ వేసుకుని సహజంగానే నడిచాడు. కానీ ఆ నడకలో పవన్ ఎంతో స్టైలిష్ గా, చార్మింగ్ గా ఉన్నాడు. బాడీ మీద ఏమాత్రం గ్రిప్ పోగొట్టుకున్నట్టు లేదు. ఫేస్ లో కూడా ఫ్రెష్ నెస్ తగ్గలేదు. గుబురు గెడ్డంతో చాలా మాసివ్ గా ఉన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే పాతికేళ్ల క్రితం చిరంజీవి ఉన్నంత రఫ్  గా ఉన్నాడు. పవన్ సహజంగా నుంచున్నా, కామన్ గా చూసినా, అందులో ఓ స్టైల్ ఉంటుంది. ప్రత్యేకించి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వక్కరలేదు. అది సహజంగా పవన్ కు వచ్చిన యాటిట్యూడ్ కావచ్చు.

 

అందుకే పవన్ ఫ్యాన్స్ పవనిజం.. పవనిజం అంటూ ఊగిపోతూంటారు. మేము పవన్ ఫాన్స్ కాదు.. భక్తులం అంటూంటారు. ఇలాంటి మ్యాజిక్ తోనే అంతటి మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ ఫేస్ ఎట్రాక్షన్ అలాంటిది మరి. ఇంకేం.. లుక్ బాగుంది.. స్టైల్ ఎక్కడికీ పోదు కాబట్టి ఆయన భారీ అభిమానగణం కోసమైనా సినిమాలు చేస్తే బాగుంటుంది కదా! ఏమంటావు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: