బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలు చేస్తూనే బీయింగ్ ఇండియా అనే స్వచ్చంగా సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ హీరో దబాంగ్ 3 సినిమా చేస్తున్నారు.  ఇందులో పాండే అనే వ్యక్తి కానిస్టేబుల్ గెటప్ వేస్తున్నాడు.  


కాగా, కొన్ని రోజుల క్రితం పాండేకు గుండెపోటు వచ్చింది.  వెంటనే స్పందించిన సల్మాన్ ఆ కానిస్టేబుల్ కు ఆర్ధిక సహాయం చేశారు.  హాస్పిటల్ లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించారు.  ప్రస్తుతం పాండే కోలుకుంటున్నాడు. 


పాండేకు గుండెపోటు వచ్చిన సమయంలో షూటింగ్ స్పాట్ లో లేడు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాలని లేదు.  కానీ, సల్మాన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా.. సల్మాన్ ఖాన్ పాండేకు సహాయం చేయడంతో అందరు మెచ్చుకుంటున్నారు.  


దబాంగ్ 3 షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.  సోనాక్షి సిన్హా హీరోయిన్. సల్మాన్ ఫిలిమ్స్ అండ్ అర్భాజ్ ఖాన్ ఫిలిమ్స్ లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: