'కల్కి' చిత్ర కథను డా. రాజశేఖర్‌ చెప్పి సింగిల్‌ నెరేషన్‌లోనే ఆయన్ని మెప్పించి ఇండిస్టీ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు రైటర్‌ సాయి తేజ్‌ దేశరాజ్‌. విడుదలై మంచి కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మాది మహబూబ్‌ నగర్‌ జిల్ల్లా. నాకు చిన్నప్పటి నుండి రైటింగ్‌ అంటే ఉన్న ఆసక్తితో ఎన్నో కథలు రాసేవాణ్ణి. కానీ వాటిని ప్రచురించడానికి లేదా సమాజంలోకి తీసుకెళ్లడానికి సరైన మాధ్యమం లేదు.

 

వాటిని ఒక బుక్‌ రూపంలో తీసుకురావడానికి చాలా డబ్బు అవసరమవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. అలాంటి సమయంలోనే ఆన్‌లైన్‌లో 'కహాని డాట్‌కామ్‌' అనే ఒక వెబ్‌ సైట్‌ను చూశాను. అందులో ఫ్రీగా మీ కథలు రాయొచ్చు అని చదివి వెంటనే కథ రాయడం మొదలుపెట్టాను. అలా నేను రాసిన మొదటి కథే 'కల్కి'. ఎక్కువగా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ గురించే మాట్లాడుతున్నారు కథ రాసుకునే సమయంలోనే ఆ ట్విస్ట్‌ అందరికీ నచ్చుతుంది అని నేను నమ్మాను.

 

'కల్కి' సక్సెస్‌ తరువాత చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అలాగే ఇద్దరు ప్రొడ్యూసర్స్‌ కూడా కాంటాక్ట్‌ అయ్యారు. వారికి కథ చెప్పాను. వారి నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఇదే వీక్‌లో నేను రాజశేఖర్‌గారికి మరో కథ చెప్పబోతున్నాను. అది మంచి ఎమోషన్‌తో కూడిన కాప్‌ థ్రిల్లర్‌. ఆయనకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రాసుకున్న కథలు అన్ని హై బడ్జెట్‌ కథలే. అందుకోసం తక్కువ బడ్జెట్‌తో రూపొందించే కథ రాయాలని చూస్తున్నాను.

 

మాది మహబూబ్‌నగర్‌ కాబట్టి ఆ బ్యాక్‌ డ్రాప్‌తో కథ రాస్తున్నాను. త్వరలో దర్శకత్వం చేసే ఆలోచన కూఉంది. ఇటీవల 'కార్తికేయ' సినిమా నిర్మాత వెంకట శ్రీనివాస్‌గారికి ఒక సీరియల్‌ కిల్లర్‌కి సంబంధించిన స్టోరీ చెప్పా. అయన నిర్మించడానికి ముందుకొచ్చారు. టైటిల్‌ 'కిన్నెరసాని'. తరువాత ఒక భారీ స్టార్‌కి స్టోరీ లైన్‌ చెప్పాను. చాలా బాగుంది. ఫుల్‌ స్టోరీ నేరేట్‌ చేయమని చెప్పారు. ఇంకో రెండు రోజుల్లో ఆ స్టోరీ చెప్తాను. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను' అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: