సమంత ఓ బేబీ సూపర్ హిట్ అయ్యింది.  మొదటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమాకు ప్లస్ అయ్యింది.  అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ రాణించింది.  ఈ విజయంతో సమంత ఖాతాలో మూడో విజయం వచ్చి చేరింది.  ఇప్పుడు సమంత ఓ బయోపిక్ మూవీలో చేస్తున్నట్టు సమాచారం.  


ఇదిలా ఉంటె, సమంత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగపై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసింది.  ఈ కామెంట్లు ఇప్పుడు ఇప్పుడు దుమారం రేపాయి.  సమంత ఎందుకు ఎలాంటి కామెంట్లు చేసిందో తెలుసుకుందాం.  సందీప్ రెడ్డి కబీర్ సింగ్ సినిమా హిట్ తరువాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.  


ఈ ఇంటర్వ్యూలో అమ్మాయి.. అబ్బాయిల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నవి మామూలే అని, అవి లేకుండా ప్రేమ ఉండదని అన్నారు.  ఈ వ్యాఖ్యలతో సమంత ఏకీభవించలేదు.  


తనకు అర్జున్ రెడ్డి సినిమా నచ్చిందని, అలా అని వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు నచ్చలేదని.. ప్రేమ ఉంటె ఎలా ఉండాలో ప్రేమికులకు తెలుసు అన్నట్టుగా మాట్లాడింది.  సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: