మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఒకవైపు సినిమాలు మరోవైపు కుటుంబానికి అంతే సమయం కేటాయిస్తున్నాడు. రీసెంట్‌గా తన పెళ్లిరోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి సౌత్ ఆఫ్రికా టూర్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

 

త్వరలో ఆలియా భట్‌తో రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సన్నివేశాల్లో పాల్గొనాల్సింది. తాజాగా చరణ్.. తన చెల్లెలు శ్రీజ పెద్ద కూతురు నివృతి బర్త్ డే వేడుకలు ఇటీవలే జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మేన కోడలికి బర్త్ డే విషెస్ అందజేసాడు.

 

ఆ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు పాల్గొన్నారు. శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తికి ఇది 11వ పుట్టినరోజు. శ్రీజ,ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కుమార్తె. శిరీష్ భరద్వాజ్‌తో విడాకుల తర్వాత శ్రీజ..కళ్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకుంది.

 

ఆమె ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే ఆమె పెద్ద కుమార్తె బర్తడే సెలబ్రేషన్ ను వారి కుటుంబ సమక్షంలోనే అత్యంత లావిష్ గా రాంచరణ్ అండ్ ఉపాసనలు నిర్వహించారు. టైట్ బిజీ షెడ్యూల్ లో కూడా రాంచరణ్ వారి కుటుంబానికిచ్చిన విలువల్ని చేసి నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: