‘ఓ బేబి’ మూవీకి వస్తున్న స్పందనతో ఆనంద పడుతున్న ఈమూవీ యూనిట్ నిన్న హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అతిధిగా వచ్చిన రానా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. సమంతకు మంచి సినిమాలలో నటించాలనే పిచ్చి ఉందని ఆ పిచ్చికి చిరునామాగా ‘ఓ బేబి’ మారిందని అంటూ ప్రశంసలు కురిపించాడు. 

అంతేకాదు ఈసినిమా నిర్మించడం వల్ల తమ సురేశ్ ప్రొడక్షన్స్ కు ఎన్ని కోట్ల లాభాలు వస్తాయో తనకు తెలియకపోయినా తమ బ్యానర్ పై ఎన్ని సినిమాలు అయినా సమంత నిర్మించు కోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీకి విమర్శకుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రశంసలు లభిస్తున్నా ‘ఓ బేబి’ రాంగ్ టైమ్ ఎంట్రీ ఇచ్చింది అంటూ ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల దృష్టి అంతా తమ పిల్లల స్కూల్ ఫీజులు బట్టలు పుస్తకాలు పై ఒత్తిడి ఉండటంతో సినిమాల విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనీ ఇలాంటి టెన్షన్ లో విడుదలైన ‘ఓ బేబి’ సినిమా బాగుండి కూడ దాని స్థాయికి తగ్గ కలక్షన్స్ రాబట్టలేకపోతోంది అని అభిప్రాయ పడుతున్నారు. దీనితో ‘ఓ బేబి’ ఈ రాంగ్ టైమ్ లో కాకుండా మే నెల మధ్యలో విడుదలై ఉంటే ఈమూవీకి అద్భుతమైన కలక్షన్స్ వచ్చి ఉండేవి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాల విజయం ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్ వదులుకుని ‘ఓ బేబి’ తప్పు చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రయాపడుతున్నాయి. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో లెక్కల మాస్టారుగా పేరు గాంచిన సురేశ్ బాబు ఈమూవీ ప్రాజెక్ట్ వెనక ఉండి కూడ ‘ఓ బేబి’ అద్భుతమైన సమ్మర్ సీజన్ ఎందుకు మిస్ అయింది అంటూ కొందరు ఆశ్చర్యపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: