రాజశేఖర్ రెండవ కూతురు శివాత్మిక తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న భాగ్యనగరంలో జరిగింది. విజయదేవరకొండ అతిదిగా వచ్చిన ఈ ఫంక్షన్ కు మరొక అతిధిగా రాజశేఖర్ కూడ వచ్చాడు. అయితే ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడే ఈ యాంగ్రీ హీరో నిన్న ఓపెన్ గా తన కూతురు శివాత్మిక గురించి చేసిన కామెంట్స్ విని చాల మంది ఆశ్చర్యపోయారు. 

ఫిలిం ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎవరైనా చేయవచ్చని అయితే ఇక్కడ రాణించలేకపోతే జీవితంలో వేరే విధంగా ఎదగడానికి సెకండ్ ఆప్క్షన్ పెట్టుకోవాలని తన కూతుళ్ళ విషయంలో కూడ తాను అదే చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే తన పెద్దకూతురు శివాని మెడిసెన్ చేస్తున్న నేపధ్యంలో తన చిన్న కూతురుని కూడ ఉన్నత చదువులు చదివి తీరాలని తాను పెట్టిన కండిషన్ వివరించాడు. 

అంతేకాదు సెలెబ్రెటీల పిల్లలు అయినంత మాత్రాన అందరు ఇండస్ట్రీలో రాణిస్తారని గ్యారెంటీ లేదని అందుచేత అన్ని విషయాలు ముందుగానే తన పిల్లలకు వివరించిన సందర్భాన్ని రాజశేఖర్ ఓపెన్ గా బయటపెట్టాడు. ఇండస్ట్రీలో రాణించలేకపోయినంత మాత్రాన నిరాశ పడకుండా వేరే రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేయాలి అంటూ రాజశేఖర్ ఈమూవీలో నటించిన ఆనంద దేవరకొండకు శివాత్మికకు క్లాస్ పీకాడు. 

అంతేకాదు సినిమాను ఎంత కష్టపడి ప్రమోట్ చేసినా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తారు అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో రాజశేఖర్ ఎంతో కష్టపడి ప్రమోట్ చేసిన ‘కల్కి’ పరాజయంతో ఇలా కామెంట్ చేసి ఉంటాడు అంటూ ఆ ఈవెంట్ వచ్చిన కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: