సౌత్ లో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది సీనియర్ హీరోయిన్ నయనతార. మూడున్న‌ర‌ పదుల వయసు దాటిన పెళ్లి అనే పదాన్ని దగ్గరకు రానీయకుండా వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సీనియర్ హీరోలతో పాటు ఇటు కోలీవుడ్ కుర్ర హీరోలకు కూడా ఆమె బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. వరుస హిట్ల మీద హిట్లు కొడుతోంది.


ఆమె ఇప్పుడు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది. సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో అంజలి కొద్దిరోజులపాటు న‌య‌న్‌కు పోటీ ఇస్తుందని అనుకున్న మూడు నాలుగు సినిమాలతోనే ఆమె దుకాణం ఎత్తేసింది. ఇప్పుడు నయనతార కు పోటీగా సమంత కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. భర్త నాగచైతన్య తో నటించిన మ‌జిలీ సినిమాతో పాటు తాజాగా వచ్చిన ఓ బేబి రెండు సూపర్ హిట్ అయ్యాయి. 


ఇదిలా ఉంటే నయనతార గతంలో చేసిన అరామ్‌ సినిమాలో కలెక్టర్ పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడు గోపి సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట. నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆమె ఈ సీక్వెల్ లో నటించడం కుదరదని చెప్పడంతో... ఇప్పుడు సమంతతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సమంత త‌మిళ్ అమ్మాయే... అక్కడ కూడా ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సమంత న‌య‌న్‌ఖు పోటీగా ఆమె ఛాన్సులు కొట్టేస్తోంది అన్న ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: