డిస్కోశాంతి..ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. ఓ పాపులారిటి ఉంది. అయితే అవి తన భర్త శ్రీ హరి చనిపోయాక ఏమాత్రం ఉపయోగించుకోవాలనుకోలేదు. అంతేకాదు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడే డిస్కోశాంతి, తన కొడుకు హీరోగా మారిన అంశంపై కూడా అంతే సూటిగా మాట్లాడారు. కొడుకు హీరోగా మారడం తనకు ఏమాత్రం ఇష్టంలేదని, ఇది శ్రీహరి కోరిక మాత్రమేనని..ఇప్పుడాకోరికే నెరవేరిందని అన్నారు.

"నా ఇద్దరి కొడుకుల్లో ఒక కొడుకు డాక్టర్, మరో కొడుకు లాయర్ కావాలనేది నా కోరిక." అయితే తన కోరిక కంటే శ్రీహరి కోరికే బలంగా ఉందంటున్నారు డిస్కోశాంతి. అందుకే తన కొడుకు రాజ్ దూత్ సినిమాతో హీరోగా మారాడని చెప్పుకొచ్చారు. వాడి రాతను తను మార్చలేనని, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుందని అన్నారు. కొడుకు సినిమాకు ప్రచారం కల్పించడం కోసం మీడియా ముందుకొచ్చిన డిస్కో శాంతి, కాస్టింగ్ కౌచ్ పై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"అబ్బాయిలు మన మీద పడరు. మనం అలుసు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్లు రెచ్చిపోతారు. మానసికంగా, శారీరకంగా మనం దృఢంగా ఉండాలి. అప్పుడు కాస్టింగ్ కౌచ్ లాంటివేం ఉండవు. ఇద్దరి అంగీకారంతో జరిగితే అది వేరే విషయం. బలవంతం చేయడం మాత్రం ఇండస్ట్రీలో లేదు. అలాంటిదే జరిగితే మాత్రం ప్రతి మహిళ చెప్పు తీసుకొని కొట్టాలి." నా కెరీర్ లో 900 సినిమాలు చేశానని, తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురుకాలేదంటున్నారు డిస్కోశాంతి. అమ్మాయిలు మాత్రం ఇండస్ట్రీలో కాస్త ధైర్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇక తన కొడుకు నటించిన సినిమాని అందరు ఆదరించాలని వాడికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: