అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణం ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించింది. ఓ బాత్ రూమ్ టబ్ లో ఆమె మృతదేహం లభ్యం కావడం.. మరణానికి కారణం తెలియకపోవడం.. శ్రీదేవి కుటుంబం గోప్యత పాటించడం అప్పట్లో మీడియాలో సంచలన వార్తలుగా మారాయి.


శ్రీదేవి మరణం విషయంలో మీడియా దాదాపు సమాంతరంగా దర్యాప్తు చేసిందనే చెప్పాలి. కానీ హత్య జరిగింది అరబ్ దేశంలో కాబట్టి ఈ దర్యాప్తులో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. శ్రీదేవి కుటుంబం చెప్పిన విషయమే దేశమంతా నమ్మాల్సివచ్చింది. కానీ ఇప్పుడు శ్రీదేవిది ప్రమాదవశాత్తూ మరణించలేదని.. అది కచ్చితంగా హత్యేనంటున్నాడో ఐపీఎస్ ఆఫీసర్.


శ్రీదేవిది కచ్చితంగా హత్యేనని.. కేరళ డీజీపీ రిషిరాజ్ సింగ్ తాజాగా కేరళ కౌముది అనే పత్రికలో ఓ వ్యాసం రాశారు. ఏ వ్యక్తి కూడా కేవలం అడుగులోతు ఉన్న టబ్‌ లో మునిగిపోయే అవకాశం లేదని రిషిరాజ్ సింగ్ అంటున్నారు. ఎవరైనా రెండు కాళ్లు పట్టుకుని తలను నీటిలో ముంచితే తప్ప చనిపోవడం జరగదన్నారు.


ఈ విషయంపై తాను తన మిత్రుడు, ఫోరెన్సిక్ నిపుణుడు ఉమదతన్ తో మాట్లాడానని.. ఆయన కూడా శ్రీదేవిది హత్యే అయి ఉంటుందని ఫీలయ్యారని రిషిరాజ్ చెప్పారు. రిషిరాజ్ వ్యాఖ్యలతో ఇప్పుడు శ్రీదేవి అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: