ఈనెల 25న విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈమూవీ అత్యంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాకుండా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఈమూవీ బయ్యర్లు భావిస్తున్నారు. విజయ్ మళ్ళీ ‘అర్జున్ రెడ్డి’ మోడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా ఈమూవీలో కనిపించే నేపధ్యంలో ఈమూవీ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుమదని భావిస్తున్నారు.

ఈమూవీకి విజయ్ దేవరకొండ రష్మికల లవ్ కెమిస్ట్రీ హైలెట్ గా మారుతుంది అని వార్తలు వస్తున్నా ఈమూవీ సెకండ్ ఆఫ్ ఈసినిమా విజయానికి అడ్డు తగులుతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం ఈమూవీ సెకండ్ ఆఫ్ అంతా భారీ ఎమోషనల్ సీన్స్ తో నడిచిందని సమాచారం. 

ముఖ్యంగా దర్శకుడు భరత్ కమ్మ కోలీవుడ్ దర్శకుడు కావడంతో ఈమూవీ సెకండ్ ఆఫ్ లో చాల చోట్ల తమిళ సినిమాల ఎమోషనల్ సీన్స్ వాతావరణం కనిపిస్తుందని  అంటున్నారు.   దీనితో ఈసినిమా  ప్రమోషన్స్‌ మాత్రమే కాకుండా క్రియేటివ్‌ విషయాలలో కూడా విజయ్‌ దేవరకొండ బాగా ఇన్‌వాల్వ్‌ అయినట్టు వార్తలొస్తున్నాయి.  దీనికితోడు ఈ మూవీ  క్లయిమాక్స్‌ విషయంలో కూడ చాలా మార్పులు  చేసినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఎమోషనల్‌ క్లైమాక్స్ కి  ట్రాజిక్‌ ఎండింగ్‌ ని  ఎంచుకున్న దర్శకుడు భరత్‌ కమ్మఆలోచనలు కాదని ఈ మూవీ క్లైమాక్స్ ను విజయ్ దేవరకొండ సుఖాంతం చేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ లో  రష్మిక చాలా ఎమోషనల్‌ కనిపించే పరిస్థితులలో ఈఎమోషనల్  సీన్స్ తో  కూడిన సెకండ్ హాఫ్ కు యూత్ కనెక్ట్ కాకపోతే ఈ మూవీకి అనుకోని ఫలితాలు వచ్చినా  ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: