ఆర్ ఆర్ ఆర్ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నాడు నిర్మాత డీవివి దానయ్య. దర్శకుడు రాజమౌళి కూడా బాహుబలి, బాహుబలి2 సినిమాల స్థాయికి తగ్గకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్ సీన్ అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలీసిందే. రాజమౌళి ప్రతి సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు చాలా అద్భుతంగా ఉండేలా చూసుకుంటాడు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్ దాదాపు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడట. ఒక్క సీన్ కోసం 60 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే తెరపై ఆ సీన్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీయార్, రామ్ చరణ్ ఇంటడక్షన్ సీన్ల కోసం కూడా దాదాపు 40 కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. 400 కోట్ల బడ్జెట్ సినిమాలో కేవలం ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్ల కోసం 100 రుపాయలు ఖర్చు పెడుతూ ఉండటం విశేషం.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. 2020 జులై 30 వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమాపై అంచనాలు పెంచేసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: