తానా మహా సభలకు పవన్ అతిధిగా రావడానికి అంగీకరించకపోతే ఒక ప్రముఖ ఛానల్ అధినేత తీవ్ర ఒత్తిడితో పవన్ తానా మహాసభలకు అయిష్టంగానే వచ్చాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే పవన్ కు అక్కడ లభించిన స్వాగతంతో పాటు పవన్ మాట్లాడిన మాటలలోని నిజాయితీ తానా మహాసభల ప్రతినిధులకు విపరీతంగా నచ్చిందని సమాచారం.

అయితే ఈ తానా మహాసభల తరువాత పవన్ కు మరింత ఒత్తిడి పెరిగి పోతున్నట్లు టాక్. రాజకీయాల కోసం విపరీతంగా పెంచుకున్న తన గుబురు గడ్డం పొడుగు జుట్టు పూర్తిగా ట్రిమ్ చేసుకుని బాగా సన్నపడటమే కాకుండా మళ్ళీ హీరో గెటప్ లో తానా మహాసభలలో కనిపించిన పవన్ లుక్ చూసి అనేకమంది ప్రముఖ నిర్మాతలు పవన్ అపాయింట్ మెంట్ అడుగుతున్నట్లు టాక్. 

ముఖ్యంగా మైత్రి మూవీస్ రామ్ తాళ్ళూరి ఏ.ఎమ్. రత్నం లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మాతలు 2024 ఎన్నికలలోపు కనీసం రెండు సినిమాలు అయినా చేయమని పారితోషికం ఎంత కావాలంటే అంత ఇస్తామని పవన్ కు మరొకసారి సందేశాలు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ మాత్రం తనకు ప్రస్తుతం సినిమాల పై ఆసక్తి లేదని కొంతకాలం తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటానని తిరిగి వారికి పవన్ సందేశాలు పంపుతున్నట్లు టాక్. 

అయితే ఈ విషయమై ఈప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ తమ అభ్యర్ధలను చిరంజీవికి అయినా చేరవేయమని నాగాబాబుతో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఈ ఇలా ఉంటే పవన్ వీరాభిమానులు కొంతమంది సెప్టెంబర్ లో వచ్చే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నుండి పవన్ సినిమాలలోకి రావాలి అంటూ సోషల్ మీడియాలో ఒక వెరైటీ ఉద్యమం చేయబోతున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: