తెలుగు ఇండస్ట్రీలో కృష్ణవంశి తీసిన ‘ఖడ్గం’చిత్రం గుర్తుంది కదా..ఆ చిత్రంలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో’ అనే పాటపై హాట్ హాట్ గా డ్యాన్స్ చేసిన కిమ్ శర్మ గుర్తుంది కదా.  తర్వాత రాంచరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో కనిపించింది.  ఈ చిత్రం తర్వాత ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ మద్య హీరోయిన్లు హాట్ ఫోటో షూట్లలో పాల్గొని అభిమానులతో షేర్ చేయడం, లైవ్ చాట్ లు చేస్తూ తమ ఉనికి చాటుకుంటున్నారు.  తాజాగా బాలీవుడ్ భామ కిమ్ శర్మ పబ్లిసిటీ కోసం ఓ ఆటోలో చక్కర్లు కొడుతూ కనిపించింది. ముంబై నగరంలో బాంద్రా వీధుల్లో అర్ధరాత్రి ఆటో రిక్షాలో చక్కర్లు కొట్టింది ఈ బ్యూటీ. రెడ్ గ్రే టీ షర్ట్, షార్ట్స్ ధరించి ఆటో ఎక్కేసింది.

అయితే ఆటోలో ఉన్నది కిమ్ శర్మ అని చాలా సేపటి వరకు జనాలకు అర్థం కాలేదట. మొత్తానికి  కిమ్ శర్మను  గమనించిన ఫోటో జర్నలిస్ట్ లు ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు పెళ్లైన తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల తన భర్తకి విడాకులిచ్చి కొంతకాలంవరకు హీరో హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేసింది. ఈ మద్య వీరు కూడా బ్రేకప్ చేప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: