మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది డియర్ కామ్రేడ్ సినిమా. గీతా గోవిందం సినిమాతో సూపర్ జోడీ అనిపించుకున్న రష్మికా మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు అర్జున్ రెడ్డి సినిమా తరువాత రఫ్ ఆటిట్యూడ్తో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ట్రైలర్ యుట్యూబ్లో 7.7 మిలియన్ వ్యూస్ అందుకుంది. 
 
ఈ సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్లో పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరువాత విజయ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుంది అనేలా ట్రైలర్ కట్ చేసారు. రష్మిక మందన్నా స్టేట్ క్రికెట్ ప్లేయర్ పాత్రలో కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కాలేజీలో రాజకీయాలు చేయొద్దని చెబుతూనే గొడవలకు దిగే పాత్రలో నటిస్తున్నాడు. 
 
జూన్ నెల నుండి కొన్ని సినిమాలు హిట్టవుతున్నా భారీ రేంజ్లో కలెక్షన్లు తెచ్చెకునే సినిమాలైతే రాలేదు. అందువలన ఇప్పుడు అందరి చూపు ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ సినిమాలవైపే ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పూరి జగన్నాథ్ లకు ఇస్టార్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే కలెక్షన్లు వస్తాయి. కానీ విజయ్ దేవరకొండ కు అలా కాదు వరుస హిట్లతో జోరుమీదున్నాడు విజయ్. డియర్ కామ్రేడ్ సినిమాకు పరవాలేదనే టాక్ వచ్చిన విజయ్ తన స్టామినాతో బ్లాక్ బస్టర్ చేయగలడు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం డియర్ కామ్రేడ్ విజయ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని తెలుస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: