సంచలన వార్తలలకు కామెంట్స్ కు చిరునామాగ కొనసాగే శ్రీ రెడ్డి ఇప్పుడు జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక తొలి సినిమా 'దొరసాని' టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈసినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి కలెక్షన్స్ విషయంలో వెనుక పడిన విషయం తెలిసిందే.   

‘దొరసాని' సినిమాలో లిప్ లాక్ సీన్ గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఏకంగా జీవితను టార్గెట్ చేసింది. ‘ఇప్పటి సినిమాల్లో లిప్‌ లాక్స్ ఒకరి మీద ఒకరు పడటం లాంటి సీన్స్ ఎక్కువైపోతున్నాయి. బెడ్ రూమ్‌లో చేయాల్సిన పనులు రోడ్డుమీద చేస్తామా' అంటూ గతంలో జీవిత చేసిన కామెంట్స్‌ ని గుర్తు చేస్తూ  శ్రీ రెడ్డి ఈ కామెంట్స్ చేసింది. అయితే తన కూతురు విషయం వచ్చేసరికి జీవిత గతంలో చేసిన కామెంట్స్ మర్చి పోయిందా అంటూ శ్రీ రెడ్డ్డి ప్రశ్నలు వేస్తోంది. 

వాస్తవానికి ‘దొరసాని’ సినిమాలో లిప్ లాక్ ఉంది కాని అది కథలో భాగం కీలకం కూడ ఇద్దరు ప్రేమికులు కామంతో ముద్దు పెట్టుకోవడం వేరు ఒకరికొకరు కావాలని ముద్దు పెట్టుకోవడం వేరు. ఇందులో ఆ ముద్దుతోటే హీరోయిన్ పాత్రను చాలా పవర్‌ఫుల్ గా చూపించాడు దర్శకుడు. ‘నీలో నేను భాగం.. నీకంటే నాకు ఈ దొరతనం ఎక్కువ కాదు’
అనే విషయాన్ని  ఒక్క ముద్దుతో చెప్పించడంతో ఆ సీన్ పై విమర్శకుల ప్రశంసలు కూడ లభిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో శ్రీరెడ్డి జీవితను టార్గెట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. గతంలో శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కోచ్  విషయంలో పోరాటం చేస్తున్నపుడు ఆమెకు జీవిత నుండి సహకారం లభించక పోవడంతో ఆ కోపం ‘దొరసాని’ పై చూపెట్టింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: