లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాలలో చిన్న చిన్న క్యారక్టర్లతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. హీరోగా చేసిన పెళ్ళిచూపులు హిట్టవ్వడంతో విజయ్ కు అవకాశాలు బాగా వచ్చాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకు పది కోట్ల రుపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 
 
విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ అందుకోవడంతో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని ప్రస్తుతం థియేటర్లలో హిట్ టాక్ తో నడుస్తుంది. ఎంతో మంది దర్శకులు విజయ్ దేవరకొండకు కొత్త కథలు చెబుతున్నారు. ఈ కథల్లో విజయ్ కు నచ్చి తనకు సూట్ కాని కథల్ని ఆనంద్ దేవరకొండతో చేయమని దర్శకులకు చెబుతున్నాడట. 
 
ఆనంద్ దేవరకొండ రెండో సినిమా విజయ్ కోసం దర్శకుడు చెప్పిన కథతోనే తీస్తున్నారని సమాచారం. తమ్ముడిని హీరోగా నిలబెట్టటం కోసం విజయ్ దేవరకొండ బాగానే కృషి చేస్తున్నాడు. మరి అన్న విజయ్ దేవరకొండలా తమ్ముడు కూడా వరుస హిట్లు ఇస్తే మాత్రం ఆనంద్ దేవరకొండ కూడా స్టార్ స్టేటస్ అందుకునే అవకాశం ఉంది. ఆనంద్ దేవరకొండ రెండో సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: