జులై 21 వ తేదీన బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ మా ఛానెల్లో మొదలు కాబోతుంది. సీజన్ 1, సీజన్ 2 లకు ఎన్టీయార్, నాని హోస్ట్ చేసారు. సీజన్ 3 కు ఎన్టీయార్ నాని ఇద్దరూ నో చెప్పటంతో నాగార్జున ఈ షోను హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షోకు నాగార్జున రెమ్యూనరేషన్ ఎన్టీయార్ తీసుకున్న దానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ షోను హోస్ట్ చేయబోతున్న నాగార్జునపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. 
 
బిగ్ బాస్ సీజన్ 3 గురించి శ్రీరెడ్డి ట్విట్టర్లో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి నటనలో ఎన్టీయార్ తోపు, బిగ్ బాస్ యాంకరింగ్ ఎన్టీయార్ చేసినట్టు ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేరు. ఎప్పటికైనా ఎన్టీయార్ ని కలిసి ఒకే ఒక్క ఫోటో ఆయనతో దిగాలని నా కోరిక అని ట్వీట్ చేసిన శ్రీరెడ్డి మరో ట్వీట్లో ఎన్టీయార్ గారు మీరు బిగ్ బాస్ కి రండి సార్ ఎంతోమంది తెలుగువాళ్ళు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే మీరే బాస్, బిగ్ బాస్, హోస్ట్ చేయడం కుదరకపోతే కనీసం ఈ సీజన్లో గెస్ట్ గా అయినా ఒకసారి రావాలి అని ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. 


గతంలో బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేసిన నానిపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి నాగార్జున బిగ్ బాస్ కు హోస్ట్ అని తెలిసి కూడా పరోక్షంగా నాగార్జునని అవమానించేలా వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీరెడ్డి మరలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు కొనితెచ్చుకుంటోంది. ఇలాంటి వివాదాలకు శ్రీరెడ్డి దూరంగా ఉంటే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: