చిరంజీవి మోహన్ బాబుల మధ్య అనేక విషయాలలో ఉన్న గ్యాప్ ఓపెన్ సీక్రెట్. అయితే మోహన్ బాబు చిరంజీవి పిల్లలు మాత్రం చాల సన్నిహితంగా ఉంటారు. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో తొలి పోస్టింగ్ పెట్టిన సందర్భంగా మంచు లక్ష్మి చరణ్ ను అభినందిస్తూ చేసిన కామెంట్స్ ఆసక్తి దాయకంగా ఉన్నాయి.

చరణ్ తన కూతురు విద్యా నిర్వాణ తో కలిసి గతంలో తీయించుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ చరణ్ కు కొన్ని సలహాలు ఇచ్చింది. తాను విద్యకు తల్లి అయిన తరువాత మాత్రమే జీవితంలో పరిపూర్ణత పొందానని తెలియ చేస్తూ టాప్ యంగ్ హీరోగా మాత్రమే కాకుండా తండ్రిగా చరణ్ ఎప్పుడు మారుతాడా అని ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసింది. 

అంతేకాదు తన కూతురు యాపిల్ చరణ్ పిల్లలతో ఆదుకోవాలని ఎదురు చూస్తోంది అంటూ చరణ్ కు ఊహించని ప్రేమతో కూడిన షాక్ ఇచ్చింది. చరణ్ ఉపాసనలకు పెళ్ళి అయి 7 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరణ్ వారసుడు రాకపోవడం మెగా అభిమానులకు ఒక లోటుగా  అనిపిస్తోంది. 

అయితే చరణ్ మాత్రం తాను పిల్లలు కనడానికి ఇంకా మానసికంగా సిద్ధం కాలేదని తనకు తండ్రి అనిపించుకోవడం అప్పుడే ఇష్టం లేదని అంటూ సరదాగా జోక్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు అక్క మంచు లక్ష్మి ఇచ్చిన క్లాస్ తో చరణ్ మనసు మార్చుకుని త్వరలో గుడ్ న్యూస్ చేపుతాడేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: