అందం అమ్మాయైతే నీలా ఉంటుందే... అనే సాంగ్ గుర్తుంది కదా.  దీని అర్ధం ఏంటి.. అమ్మాయి అంటే అందం.. అందం అంటే అమ్మాయి.  అందుకే ప్రకృతిని అమ్మాయితో పోలుస్తుంటారు. అందం కొద్దిగా తక్కువగా ఉన్న అమ్మాయిలైనా సరే మేకప్ లేకుండా బయటకు రారు.  


అందంగా కనిపించేందుకు పాపం తెగ కృష్టి చేస్తుంటారు.  అలాంటిది అందంగా ఉన్న ఓ హీరోయిన్ సడెన్ గా అందవిహీనంగా మారిపోతే ఎలా ఉంటుంది.  గుర్తు పట్టలేనంతగా మారిపోయితే.. వామ్మో ఇంకేమన్నా ఉందా అని భయపడిపోతారు. తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.  


కానీ పూరి జగన్నాథ్ హీరోయిన్ సడెన్ గా అందవిహీనంగా మారిపోయింది.  అదెలా అనుకునేరు.  కేవలం మేకప్ ట్రిక్ తోనే.  పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాలో ఆదా శర్మ హీరోయిన్.  ఈ సినిమా తరువాత క్షణం, రీసెంట్ గా కల్కి సినిమా చేసింది.  సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ జోష్ గా ఉంటుంది.  


మేకప్ ట్రిక్ తో గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  సడెన్ గా ఆ ఫోటోను చూస్తే ఎవరైనా బాబోయ్ ఎవరీమె అని షాక్ అవుతారు.  తాపీగా చూస్తేనే గాని గుర్తు పట్టరు.. ఓహ్ ఆదా శర్మ కదా అని.  ఆదా శర్మ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఇప్పటికే ఈ ఫొటోకు 65 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: