నాగార్జున స్వభావం రీత్యా వివాదాలకు చాల దూరంగా ఉంటాడు. అందువల్లనే అనేక రాజకీయ పార్టీలు నాగార్జున భార్య అమలకు ఎన్నికలలో టిక్కెట్టు ఇస్తాము అని తమంతట తాము ముందుకు వచ్చినా నాగార్జున ఏమాత్రం స్పందించలేదు. అలాంటి వివాదరహితుడైన నాగార్జున ఇప్పుడు ‘బిగ్ బాస్ 3’ షోకు హోస్ట్ గా మారడం అతడికి అనుకోని అసౌకర్యానికి గురిచేసింది అన్న వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి నాగ్ ను ఈ షోకు ఒప్పించడానికి స్టార్ మా యాజమాన్యం చాల కష్టపడవలసి వచ్చింది. ఒక ఎపిసోడ్ కు 12 లక్షల భారీ పారితోషికం ‘స్టార్ మా’ యాజమాన్యం ఆఫర్ చేయడంతో ‘బిగ్ బాస్ 3’ విషయంలో నాగార్జున మనసు మారింది అని అంటారు. వాస్తవానికి ఇలాంటి పెద్ద షోలు ప్రారంభిస్తున్నప్పుడు ఒక భారీ మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆ షోకు ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే సెలెబ్రెటీని పిలిచి అతడిని మీడియాకు పరిచయడమే కాకుండా మీడియా అడిగే అనేక ప్రశ్నలకు ఆ సెలెబ్రెటీ చేత సమాధానాలు ఇప్పించడం ఒక పరిపాటిగా కొనసాగుతోంది. 

అయితే నాగ్ ‘బిగ్ బాస్ 3’ కు సంబంధించి మీడియా మీట్ ను పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించ లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘బిగ్ బాస్ 3’ షోకు సంబంధించి మీడియా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థితిలో నాగార్జున లేకపోవడం అని అంటున్నారు.


గతంలో నాగార్జున ‘బిగ్ బాస్’ షోలు లాంటి కార్యక్రమాలు తనకు నచ్చవని ఎదుట వ్యక్తి జీవితంలోకి తొంగి చూడటం తనకు ఇష్టం లేదు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేసాడు. దీనితో అప్పటి నాగార్జున మాటలను ఇప్పుడు మీడియా గుర్తుకు చేసి అతడిని ఇరుకున పెడతారేమో అన్న సందేహంతో నాగార్జున ‘బిగ్ బాస్ 3 ప్రారంభానికి ముందు నిర్వహించ వలసిన మీడియా మీట్ వద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు శ్వేతా రెడ్డి గాయిత్రి గుప్తా ‘బిగ్ బాస్’ షో విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ విషయమై పోలీసు కంప్లైంట్ కూడ ఇవ్వడంతో ఈ విషయాలు అన్నీ మీడియా బహిరంగంగా అడిగితే మరింత అసౌకర్యంగా మారుతుందని నాగార్జున ఈ కార్యక్రమానికి సంబంధించిన మీడియా మీట్ లేకుండా డైరెక్ట్ గా ఈ నెల 21 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేద్దాము అంటూ వ్యూహాత్మకంగా మీడియాను పక్కకు పెట్టినట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: