సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ లవర్స్ గా యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ రష్మికల సాన్నిహిత్యం పై ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వీరి సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచే విధంగా వీరిద్దరి మధ్య ఒక బిజినెస్ షేరింగ్ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ ను ఎండార్స్ చేస్తూ ఆ రెడీమేడ్ దుస్తుల అమ్మకం పై చాల విశేష కృషి చేస్తున్నాడు. ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం విజయ్ కొన్ని నగరాలలో ఫ్యాషన్ ప్యారేడ్ లు చేస్తున్నాడు. 

ఈ బ్రాండ్ లో విజయ్ దేవరకొండకు భాగస్వామ్యం ఉంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈ ‘రౌడీ వేర్’ బ్రాండ్ త్వరలో అమ్మాయిల కోసం రకరకాల టాప్స్ లగిన్స్ ఇలా అనేకరకాల ఉమెన్ వేర్ మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ ఉమెన్ వేర్ ను మన దక్షిణాది ముఖ్యనగరాలలో రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేయబోతోంది. 

రష్మిక ఈ బాధ్యతను అంగీకరించడం వెనుక విజయ్ రాయబారాలతో పాటు ఒత్తిడి కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఎదో ఎఫైర్ నడుస్తోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు వీరిద్దరూ బిజినెస్ పార్టనర్స్ గా మారడంతో వీరిద్దరి ఈ వ్యాపార భాగస్వామ్యం రానున్న రోజులలో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుంది అన్న విషయమై ఆసక్తికర అంచనాలు పెరిగిపోతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: