పై ఫోటో చూశారా.. అవునూ ఎక్కడో చూసినట్టుంది కానీ.. సమయానికి గుర్తు రావడం లేదనుకుంటున్నారా.. ఆయన మనందరికీ బాగా పరిచయం ఉన్న కమెడియన్.. ఇప్పుడు గుర్తొచ్చింది కదూ.. యస్.. ఆయనే.. వెన్నెల కిషోర్..


ఇటీవల కొత్తగా వస్తున్న అనేక యాప్ లు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నాయ్.. మన ఫోటోను అప్ లోడ్ చేస్తే.. ఏ వయస్సులో ఎలా ఉంటామో చూపించే.. యాప్ లు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్స్ ను ఈ యాప్ ఉపయోగించి వాళ్లు ముసలి వయస్సులో ఎలా ఉంటారో చూపించిన పిక్స్ బాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


ఇప్పుడు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు మంచి స్పందన లభిస్తోంది. ఇన్స్టాలో పెట్టిన ఈ పోస్టుకు సెలబ్రెటీలు కూడా బాగా స్పందిస్తున్నారు.


మీరు ఎలా ఉన్నా.. కామెడీకి ఏం తక్కువ ఉండదని ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కామెడీ సృష్టిస్తున్నావని తోటి నటులు కామెంట్ చేశారు. ఏదేమైనా మీరూ ఓసారి ఇలా ట్రై చేసి అందర్నీ ఆశ్చర్యపరచండి..


మరింత సమాచారం తెలుసుకోండి: