మలయాళ నటి అమలాపాల్ మరోసారి ప్రేమలో పడింది .  ఇటీవల ఆమె భర్త విజయ్ దర్శకుడు విజయ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  కెరియర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ ఏడాది గడవకముందే అతనితో  విడాకులు తీసుకుంది.  ఇటీవల విజయ్ రెండవ వివాహం చేసుకోవడంతో  తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయింది అమలాపాల్.


 తాను ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నట్లు చెప్పిన ఈ మలయాళ బ్యూటీ ,   తన  లైఫ్ లో అతను చాలా ప్రత్యేకమని  చెప్పుకొచ్చింది. తన ప్రియుడి పేరు చెప్పడానికి ఇష్టపడని అమలాపాల్ ,   అతని తో పెళ్లికి తనకు తొందరేమీ లేదని అంటోంది . విజయ్ మంచి వక్తి అని మాజీ భర్త కు కితాబు ఇచ్చిన అమలాపాల్ , తమ మధ్య రిలేషన్ షిప్ వర్కౌట్ కాకపోవడానికి చాల కారణాలు ఉన్నాయని తెలిపింది . విజయ్ రెండవ పెళ్లి చేసుకున్న అతని సంసార జీవితం బాగుండాలని కోరుకుంటోంది అమలాపాల్ .


 ప్రస్తుతం అమలాపాల్ తమిళ , తెలుగు భాషల్లో దర్శకుడు రత్నకుమార్ రూపొందించిన ఆమె అనే బోల్డ్ సినిమా లో నటించింది . ఈ సినిమా ఈ నెల 19 వతేదీన రిలీజ్ కానుంది . బోల్డ్ కంటెంట్ తో రూపొందించిన ఈ సినిమా లో అమలాపాల్ న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: