‘సాహో’ విడుదల వాయిదా పడటంతో ఈమూవీ రిలీజ్ చేసే మరొక డేట్ గురించి ప్రభాస్ చాల లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పని అంతా ఆగష్టు రెండవ వారానికి పూర్తి అవుతుంది అనీ ఈ వర్క్స్ చేస్తున్న కంపెనీలు ప్రభాస్ కు క్లారిటీ ఇవ్వడంతో ఈమూవీని మొదట్లో ఆగష్టు 30న విడుదల చేస్తే బాగుంటుంది అన్న ప్రాధమీక ఆలోచనలు ప్రభాస్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 

దీనికితోడు సెప్టెంబర్ 2న వినాయకచవితి ఉన్న నేపధ్యంలో సెలవులతో కూడిన లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని ప్రభాస్ ఆలోచన అని అంటున్నారు. అయితే ఈమూవీ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన వేరుగా ఉంది అని తెలుస్తోంది అని తెలుస్తోంది. 

సాహో’ అనుకున్న డేట్ ఎలాగు మిస్ అయింది కాబట్టి దీపావళి పండుగను టార్గెట్ చేస్తూ ‘సాహో’ ను విడుదల చేయమని ముంబాయితో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో దీపావళికి వరసగా మూడు రోజులు సెలవులు వస్తాయి కాబట్టి ఓపెనింగ్స్ పరంగా ‘సాహో’ మ్యానియాకు దీపావళి బాగా సహకరిస్తుందని బాలీవుడ్ బయ్యర్లు ప్రభాస్ కు సలహాలు ఇస్తున్నట్లు టాక్. అయితే ఈ సలహా ప్రభాస్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటున్నారు.

దీపావళి చాల పెద్ద పండుగ అయినప్పటికీ తెలుగు వారికి అమావస్య సెంటిమెంట్ తో ఆరోజు ఏపని ప్రారంభించారు. అయితే తమిళనాడులో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దీనితో ముంబాయి తమిళనాడు గుజరాత్ లాంటి కీలక ప్రాంత ప్రజల సెంటిమెంట్ ను అనుసరిస్తూ ‘సాహో’ ను దీపావళికి విడుదల చెయాలా లేదా తెలుగు సెంటిమెంట్ ను అనుసరించి ఈమూవీని వినాయకచవితికి తీసుకు రావాలా అన్న విషయంలో ప్రభాస్ చాల కన్ఫ్యూజన్ లో ఉంటూ ‘సాహో’ రిలీజ్ కు అనుకున్న ఆగష్టు 15 డేట్ మిస్ అయినందుకు తీవ్ర నిరాశలో ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: