ఈ మద్య వస్తున్న మూవీస్ లో కంటెంట్ తక్కువ కవరింగ్ ఎక్కువ అన్నట్టుంది.  స్టోరీ ఏదైనా నాలుగు లిప్ లాక్, ఒక బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో సినిమా కంప్లీట్ చేస్తున్నారు.  దాన్ని కాస్త హాట్ హాట్ గా టీజర్, ట్రైలర్ లో చూపించి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వస్తున్న సినిమాలు హాలీవుడ్ సైతం సిగ్గుపడే విధంగా వస్తున్నాయి.  కొన్ని సీన్లలో హీరోయిన్లు నగ్నంగా నటిస్తున్నారు..ఇక పెదువులు జుర్రుకోవడం, బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రొమాన్స్ ఎంత వల్గర్ గా తీస్తున్నారో ఆ సినిమాలు చూస్తే అర్థం కాదు. 

ఇలాంటి దారుమైన సీన్ల వల్ల యువత పెడదోవ పడుతున్నారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నా..దర్శక, నిర్మాతలు ఇలాంటి మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది వచ్చిన 'గంధీ బాత్' వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎంత బూతు ఉండాలో అంత ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.  దాంతో దానికి సీజన్ 2 కూడా రూపొందించారు. హాట్ రొమాంటిక్ గా సాగే ఆ వెబ్ సిరీస్ కు తాజాగా మూడవ సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సీన్లు సెన్సార్ దాటి రావాలంటే కొన్ని కండీషన్స్ తో సినిమాను చేయాల్సి ఉంటుంది.

అదే వెబ్ సిరీస్ లకు అలాంటివి ఏమీ ఉండవు. కనుక స్టార్స్ ఎంతో మంది వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.మూడవ సీజన్ కు సంబంధించిన ఒక రొమాంటిక్ సీన్ ను లిఫ్ట్ లో చిత్రీకరించారు. అది కావాలని మేకర్స్ లీక్ చేశారో లేదంటే ఎలా బయటకు వచ్చిందో కాని అది యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో తెలుగు వారికి సుపరిచితురాలైన ఆశా షైనీ(ఫ్లోరా షైనీ) నటించింది. ఆమె ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఒక లెస్బియన్ తో కూడా రొమాన్స్ చేసే సీన్స్ గంధీ బాత్ కు హైప్ ను తీసుకు వచ్చాయి.  తాజాగా లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో కుమ్మేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: