నేచురల్ స్టార్ నానీకి అతడి కొడుకు జున్ను అంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమతోనే నాని తన కొడుకుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తన కొడుకు గురించి పడుతున్న టెన్షన్ సద్గురు జగ్గీ వాసు దేవ్ తో చేసిన ఇంటర్వ్యూలో బయటపడింది. 

నాని తన కొడుకు భవిష్యత్ గురించి టెన్షన్ పడుతూ అడిగిన ప్రశ్నకు సద్గురు నవ్వుతూ సమాధానం ఇస్తూ ఏకంగా నానీని టార్గెట్ చేసారు. తన తండ్రి తనను చాల స్ట్రిక్ట్ గా పెంచారు అన్న విషయాలను నాని గుర్తుకు చేసుకుంటూ అంత స్ట్రిక్ట్ గా తాను తన కొడుకు విషయంలో ఉండలేకపోతున్నానని అంటూ తాను అతి గారాబంతో తన కొడుకును పెంచడం తాను చేస్తున్న పొరపాటా అంటూ నాని ప్రశ్నించాడు. 

దీనికి నవ్వుతు సద్గురు ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒక సింహం తనకు పిల్ల పుట్టినప్పుడు కేవలం కొద్ది నెలలు మాత్రమే దానిని సాకి ఆపై తన వేట అదే తెచ్చుకునేలా తర్ఫీదు ఇస్తుందని అయితే మనిషి మాత్రం తాను జీవించి ఉన్నంత కాలం తన పిల్లల గురించి ఆలోచిస్తూ వారి గురించి టెన్షన్ పడుతూ ఒక విధంగా వారిని
ప్రస్తుత తరం తల్లి తండ్రులు చెడకొడుతున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.

తాను అమెరికాలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోని అమ్మాయికి 800 వందల చెప్పుల జతలు ఉండటం చూసి తాను షాక్ అయిన విషయాన్ని తెలియచేస్తూ పిల్లలకు తల్లి తండ్రులు అవసరాలు తీర్చాలి కాని విలాసాలు అలవాటు చేయకూడదు అంటూ సద్గురు నానీకి క్లాస్ పీకారు. పిల్లలను పెంచడం అంటే ఒక సినిమాలో నటించినంత సులువు కాదనీ ఆ విషయం 20 సంవత్సరాల ప్రాసెస్ అని చెపుతూ ఆ తరువాత మాత్రమే తమ పిల్లలు బాగు పడ్డారా లేక చెడిపోయారా అన్న విషయం తెలుస్తుందని తల్లి తండ్రులు ఇంట్లో ప్రవర్తించే ప్రవర్తనను బట్టి పిల్లల భవిష్యత్ ఉంటుంది అని చెపుతూ ‘నీవు హీరో అవడం చాల సులువు కానీ మంచి తండ్రి అవ్వడం చాల కష్టం’ అంటూ నానీకి చురకలు అంటించారు సద్గురు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: