మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  ఈ ట్రైలర్ ను ఇప్పటికే కట్ చేశారని టాక్.  సెప్టెంబర్ లో ఆడియో వేడుకను, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తారట.  


అదే విధంగా ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా తన 152 వ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నది.  కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కొరటాల ఇప్పటికే పూర్తి చేశారు. 


ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఫస్ట్ షెడ్యూల్ పలాసలో ఉంటుందట.  పలాస బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని అంటున్నారు.  శ్రీమంతుడు సినిమా కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన స్టోరీనే.  ఈసారి పలాసను తీసుకున్నారు.  


ఇందులో మెగాస్టార్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారు.  దీనికోసం మెగాస్టార్ స్లిమ్ అయ్యే కార్యక్రమంలో ఉన్నారు.  విశాఖలోని ఓ స్పాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఉగాదికి సినిమా రిలీజ్ ఉంటుంది.  ఈ సినిమా తరువాత నెక్స్ట్ లైన్లో చాలా ఉన్నాయి.  మరి ఎవరితో సెట్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: