క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా కథల ఎంపిక విషయంలో చాల వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్న తీరు యంగ్ హీరోలకు ఒక పాఠంగా మారితే విజయ్ తన సినిమాల ప్రమోషన్ అదేవిధంగా తన మూవీల బిజినెస్ పై అనుసరిస్తున్న  వ్యాపార ఎత్తుగడలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. భారతదేశ సినీ చరిత్రలో 'బాహుబలి' సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 

‘బాహుబలి’  సినిమా దేశవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపించడమే కాకుండా ఆ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.  అయితే ఇలాంటి సినిమాను కన్నడంలోకి డబ్ చేసి విడుదల చేయాలి అని రాజమౌళి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు.

కన్నడంలో తెలుగు సినిమాలను డబ్బింగ్ చేయకూడదన్న నిబంధనలు ఉన్న అప్పటి పరిస్థుతులలో రాజమౌళి ‘బాహుబలి' ని కన్నడ భాషలో డబ్ చేసి విడుదల చేయలేకపోయారు. ఈ విషయమై అప్పట్లో బెంగుళూరులో ఉద్యమాలు కూడ జరిగాయి. అయితే ఆ తరువాత చరిత్ర సృష్టించిన  ‘కేజీఎఫ్' తెలుగులో కూడా స్ట్రైయిట్ మూవీగా విడుదలైంది. 

ఇక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో కన్నడ నిర్మాతల సంఘం తెలుగు సినిమాల డబ్బింగ్ పై నిషేదాన్ని ఎత్తి వేసింది. సరిగ్గా  ఆ విషయాన్ని బాగా క్యాష్ చేసుకుంటూ ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ డబ్ చేయబడి విడుదల కాబోతోంది. అయితే ఇలా గత సంవత్సరం రామ్ చరణ్ తన ‘రంగస్థలం’ మూవీని కన్నడం లోకి డబ్ చేసినా అక్కడ పెద్దగా సక్సస్ కాలేదు. దీనితో రాజమౌళి విజయం అందుకోలేని కన్నడ సినిమా రంగంలో విజయ్ హిట్ సాదిస్తాడా అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: