సినీరంగంలో భలే విచిత్రాలు జరగుతుంటాయి. ఎంతో ఆలోచించి చేసిన సినిమాలు ఫట్ అంటుంటాయి. యథాలాపంగా చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. అబ్బే ఇదేం బాలేదు అనుకున్న కథలు వేరే హీరోల చేతుల్లో పడి బ్లాక్ బ్లస్టర్లు అవుతుంటాయి.


అందుకే సినీరంగంలో ఎక్కువగా అదృష్టాన్ని నమ్ముతుంటారు. నటి మంచు లక్ష్మీ కేరీర్లోనూ అలాంటి తమాషా ఒకటి జరిగింది. తెలుగు సినిమా చరిత్రలో అరుంధతి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. అనుష్క కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు.


కానీ ఈ సినిమాకు మొదట మంచు లక్ష్మితో చేద్దామని దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి అనుకున్నారట. ఆమె అప్పటికే అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరేంద్రిగా నటనలో అదరగొట్టింది. అయితే ఈ సినిమా తీసే సమయానికి మంచు లక్ష్మి అమెరికాలో ఉండటం వల్ల చేయలేకపోయిందట.


ఆ తర్వాత మమతా మోహన్‌దాస్‌ను కూడా ఈ సినిమా టీమ్ అడిగిందట. కానీ ఆమె అప్పడు క్యాన్సర్‌ కు చికిత్స తీసుకుంటున్నారు. అలా మూడో ఆప్షన్ గా అరుంధతి పాత్రకు అనుష్క సెట్ అయ్యిందట. ఇక ఆ తర్వాత తెరపై అరుంధతిగా అనుష్క ఎలా నటించిందో అందరికీ తెలిసిందే. సో..అలా మంచు లక్ష్మీ దురదృష్టం అనుష్కకు వరంగా మారిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: