తెలుగు, తమిళ సినిమాల మధ్య చక్కని స్నేహ సంబంధాలు ఉన్నాయి. తమిళంలో బాగా ఆడిన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటాయి. అలాగే తెలుగు సినిమాలు కూడా తమిళంలోకి డబ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఏక కాలంలో రెండు భాషల్లోనూ తెరకెక్కుతాయి.


ఇలాంటి సమయంలో ఒక భాషలో సినిమాని మరో భాషలో విడుదల చేసే సమయంలో సరైన టైమింగ్ పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇటీవల అమలాపాల్ నటించిన తమిళ సినిమా ఆడైను తెలుగులో ఆమె పేరిట దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సినిమా విషయంలో ఇలాగే జరిగింది.


సినిమా బాగుందని టాక్ వచ్చినా అనుకున్న సమయానికి విడుదల చేయకపోవడం వల్ల తెలుగు నిర్మాత భరద్వాజ నష్టపోవాల్సి వచ్చింది.మంచి సినిమాని తీయడమే కాదు, దాన్ని సరిగ్గా విడుదల చేసుకోకపోతే ఇలాగే నిర్మాతలు నష్టపోతారంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ.


తమిళ నిర్మాత వల్లే ఇలా జరిగిందంటున్నారాయన. అక్కడ ఫైనాన్షియర్లకి డబ్బులు చెల్లించకపోవడంతో తొలి రోజు సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా విషయంలో మమ్మల్ని తమిళ నిర్మాత తమను మోసం చేశారంటున్నారు తమ్మారెడ్డి. ఆయనకి ఎప్పుడో డబ్బు ఇచ్చేసినా తమకు సమయానికి సినిమాని ఇవ్వలేకపోయారని అంటున్నారు. తమిళ నిర్మాతపై ఇప్పటికే చలన చిత్ర వాణిజ్య మండలిలో తమ్మారెడ్డి ఫిర్యాదు చేశారు. త్వరలోనే కేసు పెట్టబోతునని ఆయన ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: