రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే సినిమా తరువాత మరలా లైన్లో పడింది. టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నది.  నాగార్జునతో చేస్తున్న మన్మథుడు 2 సినిమా ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఈనెల 25 వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.  


ఇదిలా ఉంటె, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది తెలియాలి.  భారతీయుడు 2 సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.  సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.  


సడెన్ గా సినిమా ఆగిపోవడంతో కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  దీంతో కాజల్ ప్లేస్ లో రకుల్ ను తీసుకున్నారని టాక్ నడిచింది.  మరో టాక్ ప్రకారం, ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ ఉందని, ఒకరు కాజల్ కాగా, రెండో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అని మూడో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం.  


ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టిన ఈ సినిమా తిరిగి ఎప్పటి నుంచి సెట్స్ మీదకు వెళ్తుందో తెలియాలి. మరోవైపు శంకర్.. లైకా ప్రొడక్షన్స్ లోనే సూర్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ రెండు సినిమాలను కంటిన్యూగా చేస్తారా లేదంటే ఒకదాని తరువాత మరొకటి చేస్తారా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: