గబ్బర్ సింగ్ సినిమా తరువాత హరీష్ శంకర్ కు ఆ స్థాయిలో హిట్ లేదు.  సినిమాలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. డీజే పర్వాలేదు.  ఇప్పుడు గబ్బర్ సింగ్ ప్రయోగాన్ని చేస్తున్నాడు.  బాలీవుడ్ లో సూపర్ హిట్టైన దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు. 


ఇప్పుడు తమిళంలో హిట్టైన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  అక్కడ బాబీ సింహా చేసిన నెగెటివ్ టచ్ క్యారెక్టర్ ను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు.  వరుణ్ తేజ్ ను కొత్తగా ప్రజెంట్ చేసేందుకు హరీష్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 


వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు హరీష్.  తప్పకుండ సినిమా హిట్ అవుతుందని విశ్వసిస్తున్నాడు.  మాములుగా ఈ సినిమా సెప్టెంబర్ 6 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.  


అయితే, సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అవుతుండటంతో సినిమాను సెప్టెంబర్ 6 నుంచి 13 కు షిఫ్ట్ చేశారు.  అదే రోజున నాని గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఉన్నది.  గ్యాంగ్ లీడర్ సినిమాతో వరుణ్ పోటీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: