బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మాంచి రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజే ఎన్నో ట్విస్టులు హౌస్‌లో చోటు చేసుకున్నాయి. తొలి వారం నామినేషన్‌కు బిగ్ బాస్ మొత్తం ఐదుగురిని నామినేట్ చేయడంతో పాటు వీరు తమకు బదులుగా ఎవరిని రీ ప్లేస్ చేయాలో కూడా ఆప్షన్ ఇచ్చాడు. తొలి వారం ఎలిమినేషన్లో ఉన్న వారందరు తమకు బదులుగా ఎవరిని ఎలిమినేషన్‌కు రీ ప్లేస్ చేస్తున్నామో కూడా చెప్పేశారు.
ఇదిలా ఉంటే ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్‌తో పాటు ఈ షోకు ప్రస్తుతం మానిటర్‌గా ఉన్న హేమ కూడా చివర్లో అనూహ్యంగా నామినేట్ అయ్యింది. బాబా భాస్కర్, మానిటర్ హేమలలో ఎవరో ఒకరిని సేవ్ చేసి, మరొకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు.
హౌస్మేట్స్ అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్‌ను సేవ్ చేసి, హేమను నామినేట్ చేశారు. హేమను అందరూ ముక్తకంఠంతో నామినేట్ చేయడం వెనక హౌస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలే కారణమా ? అన్న డౌట్లు వస్తున్నాయి. హేమ హౌస్‌లో కొందరికి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించడంతో మిగిలిన వారంతా హర్ట్ అయినట్టే ఉంది.
మానిటర్‌గా ఎవరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలో ? ఎవరిని సేవ్ చేయాలో తనకున్న విచక్షణాధికారంతో కొందరికి వన్‌సైడ్‌గా సపోర్ట్ చేసినట్టు మిగిలిన వారు భావించడంతోనే ఆమెకు చివర్లో ఎలిమినేట్ ప్రక్రియకు ఎంపిక చేసి బాబా భాస్కర్‌ను సేవ్ చేశారు. ఏదేమైనా హౌస్‌లో అప్పుడే గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయ్.