క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడినా చాల నిజయితీగా స్పష్టంగా మాట్లాడుతాను అని భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆనిజాయితీ వల్ల విజయ్ సినిమాలను కొనుక్కునే బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీని తను ప్రమోట్ చేస్తూ కన్నడంలో క్రేజీ హీరో యష్ తమిళంలో విజయ్ సేతుపతి మళయాళంలో దుల్కర్ సల్మాన్ ల సహాయం తీసుకుంటూ ఆ హీరోలను విజయ్ పొగుడుతూ వారిచేత తనను కూడ పొగిడించుకుంటున్నాడు.

ఈ పరిస్థితులలో విజయ్ అత్యుత్సాహంతో దుల్కర్ ను పొగుడుతూ ఒక మళయాళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోరపాటున విజయ్ అన్న మాట పై మళయాళ మీడియా చాల నెగిటివ్ కామెంట్స్ చేస్తోంది. దుల్కర్ తన అభిమాన నటుడు అని చెపుతూ అతడు నటించిన ‘ప్రేమమ్’ సినిమా నుండి అన్ని సినిమాలు తాను ఆన్ లైన్ పైరసీలో చూశానని చెప్పడం మళయాళ మీడియాను ఆశ్చర్యపరిచింది. 

అయితే ఆన్ లైన్ పైరసీ అని అంటూ డౌన్ లోడ్ చేయడం నిషేధం అంటూ దుల్కర్ మళయాళ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితులలో ఏకంగా విజయ్ దేవరకొండ లాంటి టాప్ హీరో దుల్కర్ సినిమాలను ఆన్ లైన్ పైరసీలో చూసాను అంటూ గొప్పగా చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ మళయాళ మీడియా విజయ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతోంది. అంతేకాదు ‘డియర్ కామ్రేడ్’ మూవీని కూడ అందరు ఇలా ఆన్ లైన్ పైరసీలో చూస్తే విజయ్ అంగీకరిస్తాడా అంటూ సెటైర్లు వేస్తోంది.

దీనితో ఈ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాల వరకు రావడంతో ఓపెన్ గా మాట్లాడటం మంచిదే అయినా తప్పు చేస్తూ ఇలా మాట్లాడడం ఒక హీరోకు సరైన పద్దతా అంటూ కొందరి కామెంట్స్. మరికొందరైతే విజయ్ తన మాట తీరు మార్చుకోకపోతే విజయ్ చాల నష్టపోతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: