కింగ్ నాగార్జున 2002లో మ‌న్మ‌థుడు సినిమా చేశాడు.. ఈ సినిమాతో ఇప్ప‌టికి నాగార్జుకు తిరుగులేని రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే ఆ సినిమా వ‌చ్చిన 17 సంవ‌త్స‌రాల‌కు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 చేస్తున్నాడు. మన్మథుడు 2 కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 9 న విడుదలకు సిద్ధమైంది మరియు ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ బిజినెస్ దుమ్ము లేపుతోంది.


ఇప్ప‌టికే రిలిజ్ అయిన టీజ‌ర్ మ‌రియు స్టిల్స్ నాగ్‌కు మ‌ళ్లీ మ‌న్మ‌థుడు స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే తాజా విషయం ఏమిటంటే, ఈ చిత్రం యొక్క శాటిలైట్‌ హక్కులను స్టార్ మా రూ. 8.3 కోట్లకు సాధించింది, ఇవి నాగ్ కెరీర్‌లో టాప్ రేంజ్‌ మరియు అత్యధికం. ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతోంది. డిజిటల్ రైట్స్ లో ఇప్పటికే మన్మథుడు 2 దూకుడు చూపిస్తుంది.


నాగ్ బిగ్ బాస్ 3 లో తన హోస్టింగ్‌తో ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా వార్తల్లో నిలిచాడు. అయితే మన్మథు 2 మ‌రోసారి నాగ్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాడు.  ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: